Rishi Prasad- A Spiritual Monthly Publication of Sant Sri Asharam Ji Ashram

శ్రాద్ధం : ఒక పుణ్యదాయకమగు, భగవదీయ కర్మ

 (శ్రాద్ధ పర్వం : సెప్టెంబరు 1 నుండి సెప్టెంబరు 17 వరకు)

గరుడ పురాణం (10.57-59) లో వస్తుంది కాలానుగుణంగా శ్రాద్ధం చెయ్యడం వలన ఎవ్వరూ దు:ఖితులుగా ఉండరు.

....ఆయు: పుత్రాన్‌ యశ: స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియమ్‌ ౹౹

పశూన్‌ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్‌ పితృపూజనాత్‌ ౹...

పితరులను పూజించిన మానవుడు ఆయుష్షు, పుత్రులను, యశస్సు, కీర్తి, పుష్టి, బలం, శ్రీ, పశుధనం, సుఖం, ధనం మరియు ధాన్యాలను పొందుతాడు.’

దైవకార్యం కంటే కూడా పితృకార్యానికి ప్రత్యేక మహత్తు ఉంది. దేవతల కంటే ముందు పితరులను ప్రసన్నం చేసుకోవడమనేది ఎంతో కల్యాణకారి’.

ఎవరైతే శ్రాద్ధం చెయ్యరో వారి పితరులు అసంతుష్టులై ఉంటారు మరియు వారి ఇంటిలో సుఖ-శాంతులు మరియు సమృద్ధి యొక్క లోటు, వ్యాధులు - ఇవన్నీ జరుగుతాయి. అందుకే మంచి సంతానం మరియు ఆరోగ్యానికై కూడా పితృ-శ్రాద్ధం చెయ్యాలి. ఎవరైతే శ్రాద్ధం చేస్తారో మరియు ఇతరులకు మేలు చేస్తారో వారికి ఇతరులు ఏమైనా ఇస్తే వారికి పుణ్యం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది.

శ్రాద్ధంలో తులసి ఆకులను ఉపయోగించినట్లయితే పితరులు తృప్తులౌతారు. విష్ణులోకానికి వెళ్తారు. వారెంత తృప్తులైతే అంతగా మనల్ని ఆశీర్వదిస్తారు. నేను తులసిని ఉపయోగించే శ్రాద్ధం చేస్తాను.

శ్రాద్ధంలో ఉత్తమమైనవి ఏవి ?

మూడు వస్తువులు శ్రాద్ధంలో ప్రశంసనీయమైనవి :

(1) శుద్ధి

(2) అక్రోధం (కోపం లేకుండా శాంత చిత్తులై ఉండటం)

(3) అత్వరిత : తొందరపాటు వద్దు, ధైర్యం.

మూడు వస్తువులు శ్రాద్ధంలో పవిత్రమైనవి :

(1) నువ్వులు

(2) కూతురి కొడుకు-మనుమడు

(3) శ్రాద్ధ సమయం

మధ్యాహ్నం 11:36 నుండి మొదలుకొని 12:24 దాకా ప్రత్యేక సమయంగా భావించబడింది. కొంచెం ముందూ-వెనుకా అయితే ఫర్వాలేదు. కానీ ఈ కాలంలో శ్రాద్ధానికి ప్రత్యేక పవిత్రత ఉంటుంది. శ్రాద్ధం చేసే ఆరంభంలో మరియు అంతంలో ఈ శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్ఛారణ చెయ్యడం వలన శ్రాద్ధంలోని పొరబాట్లు నశించిపోతాయి, పితరులు ప్రసన్నలౌతారు మరియు అసుర శక్తులు పారిపోతాయి :

దేవతాభ్య: పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ ౹

నమ: స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవన్త్యుత ౹౹

సమస్త దేవతలు, పితరులు, మహాయోగులు, స్వధా మరియు స్వాహ - అందరికీ మనం నమస్కారం చేస్తాం. వీరంతా నిత్య (శాశ్వతమైన) ఫలాన్ని ప్రదానం చేసేటటువంటి వారు’ (వాయు పురాణం : 74.16)

శ్రాద్ధంలో అవసరమైన ఏడు శుద్ధులు

శ్రాద్ధ సమయంలో ఏడు ముఖ్య శుద్ధులను దృష్టిలో ఉంచుకోవాలి :

(1) స్నానాదులతో శరీరం శుద్ధి గావించబడాలి.

(2) శ్రాద్ధపు ద్రవ్య-వస్తువులు శుద్ధంగా ఉండాలి.

(3) స్త్రీ శుద్ధంగా ఉండాలి, ఋతుస్రావంలో ఉండకూడదు.

(4) ఎక్కడైతే శ్రాద్ధం జరుగుతుందో అక్కడి భూమి శుద్ధంగా ఉండాలి. ఆవు పంచకంతో