శంక : బ్రహ్మవిద్య యొక్క ప్రయోజనం మోక్షసిద్ధి. అది బ్రహ్మైక్య బోధ (ఆత్మ మరియు బ్రహ్మ యొక్క ఐక్యతా జ్ఞానం) నుండి కలుగుతుంది. బాగుంది, అయితే ఆ మోక్షం అనేది శాశ్వతమైనదా లేక అశాశ్వతమైనదా ?
ఒకవేళ అశాశ్వతమైనదైతే వైరాగ్యం కూడా తాత్కాలికమైనదిగా ఉండాలి. అశాశ్వతమైన మోక్షం అవసరమే లేదు. ఒకవేళ మోక్షం శాశ్వతమైనదైతే అది సాధన వల్ల కలిగేదిగా ఉండకూడదు. ఎందుకంటే శాశ్వతమైన దానిని పొందడంలో సాధన యొక్క అవసరమే ఉండదు. ఆ పరిస్థితిలో శాస్త్రాలలో చెప్పబడిన సాధనలన్నీ అవసరంలేనివే అని ఋుజువవుతారు. ఒకవేళ బ్రహ్మజ్ఞానం అర్థవంతమైనదే అయితే బంధనం అనేది అజ్ఞానం వల్ల కలుగుతుందని ఋుజువవుతుంది. కానీ ఆత్మ అనేది బ్రహ్మయే అయినప్పుడు, అందులో అజ్ఞానంగానీ, దాని ద్వారా కలిగే భ్రమ ఉండడం అనేదిగానీ హృయాస్పదమౌతుంది. అసలు చెప్పాలంటే ఆత్మ బ్రహ్మ కాదు, అలా ప్రతివ్యక్తి యొక్క సహజమైన అనుభవం కూడా. శాస్త్రాలలో రెండింటికీ గల భేదం కూడా తెలియజేయబడింది. జీవుడు అల్పజ్ఞానం కలవాడు, పరిమితులు కలవాడు, లోకానికి చెందినవాడు. బ్రహ్మ సర్వజ్ఞుడు, పరిమితులు లేనివాడు, సకల శక్తివంతుడు. బంధనం అనేది కూడా ప్రతిజీవి యొక్క సహజ అనుభవం. కాబట్టి. బంధనం అనేది నిజం, బంధనం తొలగడం అనేది జ్ఞానంతో కానేరదు అది కర్మలు (పనులు), ఉపాసన, యోగం అనే వాటిని కోరుతుంది. కాబట్టి బ్రహ్మవిద్య యొక్క చింతనయే నిరర్థకమైనది.
సమాధానం : మోక్షం అనేది శాశ్వతమైనది. అయినప్పటికీ దీని కొరకు ఏ సాధనా మార్గాలు శాస్త్రాలలో తెలుపబడి ఉన్నాయో అవి వ్యర్థం కావు. మోక్షం అనేది ఆత్మ యొక్క సొంత స్వరూపమే గానీ, మరొకటి కాదు. మనం ఎక్కడా బంధింపబడి లేము. బంధనం అనేది ఒక కల్పన మాత్రమే. అది ఒక భ్రమ. ఆలోచించి చూస్తే బాల్యం నుండి ఇప్పటిదాకా మనం ఎందరి అనుబంధంలోనో చిక్కుకొన్నాం, బయటపడ్డాం.
డబ్బుతో అనుబంధాన్ని పెంచుకొన్నారు. అది వెళ్ళిపోయింది. భార్య, సంతానం, స్నేహితులు అందరి యొక్క అనుబంధంలో మనం చిక్కుకొన్నామని భావిస్తూ ఉంటారు. కానీ అన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వెళ్ళిపోయారు. అవి ఏర్పడినప్పుడు మనం బంధనంలో చిక్కుకొన్నట్లు భ్రమ కలుగుతుంది. అయిునప్పటికీ మనం ఎప్పటిలాగే అలాగే ఉంటారు. మనల్ని ఎవ్వరూ బంధించలేరు. ఒక కల వలె ఇవన్నీ వస్తూ పోతూ ఉంటారు. మోక్షం మాత్రం మన యొక్క సహజమైన స్వరూపం. మన అసలు స్వరూపమగు మోక్షాన్ని పొందడంలో ఏవైతే అడ్డుగా ఉంటాయో, బంధనాలనే భ్రమలు ఉంటాయో వాటిని దూరం చేసుకోవడానికి సాధన యొక్క అవసరం ఉంటుంది. అందువలననే శాస్త్రాలు సార్థకమైనవి (అర్థవంతమైనవి). మోక్షాన్ని కలిగించుకోవడానికి సాధన యొక్క అవసరం ఉండదు. లేకుంటే మోక్షం కూడా ఖచ్చితంగా అశాశ్వతమై ఉండేది. భగవాన్ శంకరాచార్యులవారు అంటారు :
రోగార్తస్యైవ రోగనివృత్తౌ స్వస్థతా ౹
ఆరోగ్యం అనేది మన యొక్క స్వరూపం. కానీ వేడిమి చలి వల్ల, వాత పిత్త కఫాలు ఎక్కువ కావడం వల్ల లేదా మరోకారణంగా శరీరానికి వ్యాధి కలిగిందంటే దాని నివారణ కోసం ఔషధాలను సేవిస్తాం. మనం వ్యాధి రాకముందు కూడా ఆరోగ్యంగా ఉన్నాం. వ్యాధి నివారణ అయిన తరువాత కూడా ఉంటాం. అదే విధంగా మోక్షం అనేది మన యొక్క స్వరూపం. దానిలో బంధనం అనే భ్రమ ఏదైతే కలిగిందో, దానిని దూరం చేసుకోవడానికి బ్రహ్మజ్ఞానం అవసరం. బ్రహ్మజ్ఞానం కొరకు బ్రహ్మచింతన అవసరం. శాస్త్రాలు బ్రహ్మచింతనకు ప్రతిరూపాలు. అందువలన శాస్త్రాల యొక్క అవసరం ఉంది. శాస్త్రాలలో వర్ణించిన సాధనలన్నీ పరస్పరం బ్రహ్మజ్ఞానానికి సహకరించేవే.